అంగన్వాడీ సెంటర్లు సమర్ధవంతంగా నిర్వహించడానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలతో కలిసి నిరసన తెలిపారు. అంగన్వాడీలకు రూ.26వేలు వేతనం ఇవ్వాలని కోరారు. లబ్దిదారులకు ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలన్నారు