గ్యాంగ్ నేరాలను గుర్తించి కేసు నమోదు చేయాలని అధికారులను సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. శనివారం మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే ఆస్తి సంబంధిత నేరాలను గ్యాంగ్ కేసులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. పదేళ్లుగా జరిగిన గ్యాంగ్ నేరాలను గుర్తించి, నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. దోషులకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.