రెండు రోజుల క్రితం బత్తలపల్లి మండలంలో బొగ్గు వ్యాపారస్తుల నుండి తీసుకునే కమిషన్ల వ్యవహారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ పై బత్తలపల్లి ఎస్సై సోమశేఖర్ కేసు నమోదు చేశారు. కాగా ఘర్షణలో గాయపడ్డ గంటాపురం జగ్గు వర్గీయుడు కౌశిక్ ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా తుపాకీ బయటపడింది. దీనిపై పోలీసుల విచారణ చేయగా గంటాపురం జగ్గు తనకు ఇచ్చాడని కౌశిక్ చెప్పడంతో వారిపై అక్రమ ఆయుధాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.