అన్నమయ్య జిల్లా.మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులకు యూరియా సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన నిర్వహించారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రైతుల పంటలకు అవసరమయ్యే ఎరువుల కొరత పెరిగిందని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని . యూరియా కొరత కారణంగా ప్రవేట్ దుకాణాల్లో అధిక ధరలకు రైతులు యూరియా కొనుగోలు చేస్తున్నారని . వెంటనే రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.