సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలో ఉన్న లేపాక్షి మండలం నాగేపల్లి వద్ద వెలసిన హజరత్ వీర్ భక్తర్ వలి ఉరుసు మహోత్సవా లు అక్టోబర్ 4. 5. 6 వతేదిలో మూడు రోజుల పాటు జరుగుతాయని, కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలలో అందరూ ఎ ల్గొని విజయవంతం చేయాలని దర్గా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మక్తియర్, శ్రీనివాస్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఉత్సవంలో భాగంగా బుధవారం పూలకుంట సర్పంచ్ మంజునాథ్ తో కలిసి స్థానిక ఎమ్మేల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తి గత కార్యదర్శి బాలాజి, మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార నతో పాటు ఇతర పట్టణ ప్రముఖులతో పాటు అధికారులను ఆహ్వానించారు.