బాపట్ల జిల్లా ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా బదిలీ అయ్యారు.ఆయనను ఎక్సైజ్ కమిషనరేట్ లో రిపోర్టు చేయవలసిందిగా మంగళవారం ఉత్తర్వులు అందాయి.జిల్లాలో బార్ల టెండర్లకు స్పందన కరువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై వేటు వేసిందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నారు.ఎక్సైజ్ అధికార యంత్రాంగం ఎంతగా కృషి చేసినప్పటికీ నష్టాలు తప్పవన్న భయంతో బార్ల కోసం ఎవరూ టెండర్లు వేయలేదు.దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.