శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పరిగి రోడ్డు డంపింగ్ యార్డు లోని చెత్తను రీసైకిలింగ్ చేయు యంత్రాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ ను మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న చెత్త అంతా డంపింగ్ యార్డులో 49 టన్నుల చెత్తను సేకరించడం జరిగింది. అందులో తడి చెత్త, పొడి చెత్త, ఇనుము మరియు విద్యుత్ సంబంధించి వస్తువులను వివిధ రకాలుగా వేరు చేసిన చెత్తను, చెత్త శుద్ధి యంత్రాల ద్వారా చెత్తను ఇప్పటి వరకు 23 టన్నుల చెత్తను రీసైకిలింగ్ చేసి ఎరువుగా తయారు చేశారని తెలియజేశారు.