పొన్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో కగ్గా రవి అనే వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడు బాపట్ల పట్టణ రైలు పేటకు చెందినవాడని, బాపట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడని గురువారం బాపట్ల రైల్వే పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, బాపట్ల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా బాపట్ల రైల్వే పోలీసులు వివరించారు.