పలమనేరు: రూరల్ మండలం స్థానికులు ఆదివారం తెలిపిన సమాచారం మేరకు. కొలమాసనపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామం వద్ద కల్లాడు గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా, ద్విచక్ర వాహనం ఢీకొని గాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.