కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం చెప్పులతో పాటు ఫుల్ బాటిల్ లైన్ లో పెట్టిన వీడియో వైరల్ గా మారింది.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి లో యూరియా కోసం రైతులు రాత్రి నుంచి కష్టాలు పడినట్లు ఆదివారం రైతులకు తెలిపారు. ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద యూరియా బస్తాల కోసం సుమారు 400 మందికి పైగా రైతులు పెద్ద ఎత్తున చెప్పులు లైన్ లో పెట్టారు.శనివారం సాయంత్రం యూరియా లోడ్ వచ్చిందని సమాచారం మేరకు రాత్రి నుంచి రైతులు చెప్పులు లైన్ లో పెట్టి రాత్రంతా అక్కడే ఉన్నారు. చెప్పులతో పాటు ఫుల్ బాటిల్ కూడా లైవ్ లో పెట్టిన వీడియో వైరల్ గా మారింది.