రోడ్డు దాటుతున్న గొర్రెలపై లారీ దూసుకు వెళ్లిన ఘటన పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఒక గొర్రె అక్కడికక్కడే మరణించగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.గోరంట్ల లక్ష్మీనారాయణ కు చెందిన గొర్రెల మంద మేత అనంతరం ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తనకు దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.