హింసకు గురైన మహిళలకు,బాలికలకు సఖి వన్ స్టాప్ సెంటర్ బాసటగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు.బాపట్ల పట్టణంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ ను ఆయన శుక్రవారం రాత్రి సందర్శించారు.ఈ సెంటర్లో బాధిత మహిళలకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సేవలు గురించి ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సెంటర్లో అందజేసే సేవల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు.బాధిత మహిళలు ఈ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు