సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే అధికారులను పిలిచి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేశారు. అధికారులు ప్రజలను కార్యాలయాలు చుట్టూ ఎక్కువ రోజులు తిప్పుకోకుండా, నిర్దిష్ట కాల పరిమితిలో మరి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.