గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన హవల్దార్ రత్న కుమార్ జమ్మూ కాశ్మీర్లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. లెఫ్టినెంట్ కన్నల్ రమేష్ బాబు ఆధ్వర్యంలో పొన్నూరు ఈఎస్ఎం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు రత్న కుమార్ కు ఘనంగా నివాళులర్పించి, దేశానికి ఆయన చేసిన సేవలను రమేష్ బాబు కొనియాడారు.