కనిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కనిగిరి మండల నూతన టిడిపి అధ్యక్షులు కొండా కృష్ణారెడ్డి అన్నారు. కనిగిరి మండలం టిడిపి అధ్యక్షుడిగా కొండా కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం కృష్ణారెడ్డిని కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.... మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి టిడిపి బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అన్నారు.