బాపట్లలోని ప్రధాన రహదారిపై స్కూలు విద్యార్థులు ఘర్షణకు పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం బాపట్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం సాయంత్రం ఘర్షణకు దిగారు. స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు ఘర్షణకు దిగారు ఆరా తీసిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వారితో మాట్లాడారు.