కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అతిపెద్ద స్కాండల్ గా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిర్వీర్యం అయిందని చెప్పారు. వందేళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్ళకే కూలినా మేము తప్పు చేయలేదని బిఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగర శివారులోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం అవినీతిపై కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టబోతున్నామని చెప్పారు. కేసీఆర్, హరీష్ దోషులుగా తేలారన్నారు.