విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ను సోమవారం మధ్యాహ్నం బొబ్బిలి డిఎస్పి భవ్య రెడ్డి తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ భవనాలు పరిసరాలను పరిశీలించారు. స్టేషన్కు సంబంధించిన రికార్డులు సీడీ ఫైల్స్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ తనిఖీల్లో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి ఏ వి రమణ, ఆండ్ర ఎస్ఐ కే సీతారాం పాల్గొన్నారు.