సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెరుచుకుంది. సోమవారం ఉదయం 3:30 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ చేసి సుప్రభాత సేవ, బిందెతీర్థం, బాల భోగం, నిజాభిషేకం పూజలు నిర్వహించినట్లు ఉదయం ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు భక్తులకు సర్వదర్శనాలు అనుమతించబడతాయని తెలిపారు. సత్యనారాయణ వ్రతాలు, వాహన పూజలు, నిత్య కైంకర్యాలు, కళ్యాణం, బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. అనుబంధ దేవాలయం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు యధావిధిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.