నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలిగారు. వేడుకలకు హాజరైన మంత్రి శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఉపాధ్యాయులు భోజనానికి వెళ్లడంతో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ మంత్రిని మాట్లాడాలని కోరగా, కలెక్టర్ కోరిక మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.