పత్తికొండలో 'రైతుల పోరుబాట' కార్యక్రమం చేపట్టారు. టమాటా, ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. రైతులను ఆదుకునేంత వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల వైసీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.