Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
యూరియా పంపిణీ లో జిల్లా యంత్రాంగం విఫలమైందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా నాయకులు కోలా కిరణ్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం మండలంలోని బాలగుడబ గ్రామంలో పర్యటించి రైతుల యూరియా ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు రైతు సేవా కేంద్రానికి వెళ్లి సచివాలయ అధికారులతో ఎరువులు విషయమై చర్చించారు. గ్రామంలో ఉన్న రైతులు, అవసరమైన ఎరువులు, ఇంతవరకు పంపిణీ చేసిన యూరియా తదితరు వాటిపై ఆరా తీశారు. గ్రామంలో వెయ్యి బస్తాలు అవసరం కాగా, ఇప్పటివరకు రెండు విడతలుగా 526 బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారన్నారు.