బాపట్ల జిల్లా టిడిపి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయమై పార్టీ అధిష్టానవర్గం పంపిన పరిశీలకులు సోమవారం సాయంత్రం అభిప్రాయ సేకరణ జరిపారు.ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తో సహా ముగ్గురు పరిశీలకులు బాపట్ల వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు,సీనియర్ నేతలు పాల్గొన్నారు. తమ నివేదికను పార్టీ అధిష్టానం వర్గానికి పంపుతామని ఎమ్మెల్సీ అనురాధ మీడియాకు చెప్పారు.