వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుభంద దేవాలయమైన భీమేశ్వరాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గీతే సందర్శించి,ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనుల దృష్ట్యా ట్రాఫిక్,భద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.