ప్రముఖ తెలుగు నటుడు మంచు మనోజ్ తన భార్యతో కలిసి శుక్రవారం మడకశిర నియోజకవర్గం లోని హేమావతి గ్రామంలో వెలసిన హేన్జేరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ కు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు.