బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ బి ఎక్స్ రోడ్ వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఇల్లు లేని పేదలు రోడ్డుపై బైఠాయించారు. గత ప్రభుత్వం మండల శివారులో 176 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించింది. అందులో 99 ఇళ్లను ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు అందజేయగా, మిగతా 77 ఇండ్లను పేదలకు కేటాయించలేదు.ఖాళీగా ఉన్న ఇళ్లను తమకు కేటాయించాలని గ్రామంలోని ఇల్లు లేని మహిళలు రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో స్థానిక తహసిల్దార్ తో ఎస్సై ఫోన్లో మాట్లాడి ఆందోళనకారులను సముదాయించడంతో విరమించారు.