కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తాలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రహణ సమయంలో అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదివారం రాత్రి 9:56 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:26 నిమిషాల వరకు కొనసాగిందని సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగ్రహణం అనేది కేవలం ప్రకృతికి సంబంధించిందేనని అన్నారు. ఈ సమయంలో ఆహారం తినకూడదని నిబంధన వట్టి కల్పితమైన అని తెలిపేందుకే అల్పాహారం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సృష్టిని సృష్టించిన ఆ భగవంతుని ఆలయాలను మూసివేయడం కరెక్ట్ కాదని అన్నారు.