వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుండి లైన్ లో చెప్పులు పెట్టి నిలుచున్నారు. పంటలు వేసి పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చినప్పటికీ యూరియా చల్లాల్సిన సమయం దాటిపోయిన కూడా యూరియా దొరకకపోవడంతో తెల్లవారుజామునుండే యూరియా కోసం పడిగాపులు కావలసిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్వతగిరి లోని మన గ్రోమోర్ సెంటర్ ముందు ఉదయం నుండే చెప్పులు పెట్టి నిలుచున్నప్పటికీ యూరియా దొరుకుతుంది అనే నమ్మకంలో కూడా లేకుండా పోతుందని రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది.