చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం. ప్రసన్నయ్య గారి పల్లి వద్ద శనివారం ఉదయం 11 గంటలకు ప్రాంతంలో కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలకు త్రాగునీరు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పడిన 13 నెలలనే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.వి.రెడ్డి, మాధవరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .