స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎవరిపై ఆధారపడకుండా శాయశక్తులా పోరాడుతామని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. మహేశ్వరంలో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసి జిల్లాలో కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.