అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన వై.మహమ్మద్ గౌస్ అనే 15 ఏళ్ల బాలుడు మంగళవారం అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మహమ్మద్ గౌస్ పాఠశాలకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్ళాడు. సాయంత్రమైన ఇంటికి రాలేదు. పాఠశాలకు రాలేదని తెలుసుకున్న కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆచూకీ 9032331236, 7989594793 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.