సంగారెడ్డి ఇన్చార్జ్ ఆర్డిఓ గా పాండు నియమితులయ్యారు. సంగారెడ్డి ఆర్డిఓ గా పనిచేసిన రవీందర్ రెడ్డి పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ రెవెన్యూ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా అందోల్ ఆర్డిఓ పండుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన బుధవారం బాధ్యతలను స్వీకరించి మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. తాసిల్దార్ జయరాం నాయక్ ఆధ్వర్యంలో నూతన ఇంచార్జ్ ఆర్డిఓ ను శాలువా కప్పి పూల మొక్క ఇచ్చి ఘనంగా సన్మానించారు.