ఎల్లారెడ్డి : జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ సంఘం ఎన్యుజే (ఇండియా) ఇటీవల జరిగిన ఎన్నికల్లో జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనా ఎల్లారెడ్డికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ ను ఎల్లారెడ్డి మాజీ జడ్పిటిసి, కాంగ్రెస్ నేత షేక్ గయాజొద్దీన్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆయన ఈ సందర్బంగా శాలువాతో సత్కరించారు. జర్నలిజం వృత్తిలో సమాజానికి, జర్నలిస్టులకు చేస్తున్న సేవ అభినందనీయం అన్నారు. గత వారం రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలుసుకొని జర్నలిస్టుల సమస్యలపై అయన చర్చించారన్నారు.