సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరు లో చిక్కుకున్న బాధితుడు స్వామికి కరీంనగర్ ఎంపీ ఆఫీస్ నుంచి కేంద్రమంత్రి బండి సంజయ్ బుధవారం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. స్వామితో పాటు మరో నలుగురు మానేరులోని నీళ్లలో చిక్కుకున్నారు. బాధితులు ఎవరు భయపడవద్దని, అధికారులు పూర్తిగా అండగా ఉంటారని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. తామెవరం భయపడడం లేదని ధైర్యంగా ఉన్నామని, అధికారులు కాపాడుతారని నమ్మకం ఉందని బండి సంజయ్ కి స్వామి తెలిపారు.