రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో బుధవారం మధ్యాహ్నం పిడుగు పడింది. భారీ శబ్దంతో పాటు మెరుపు రావడంతో పాటు ఒక్కసారిగా బిల్డింగ్‌పై నుంచి పెచ్చులు ఊడి జెండా కింద పడడంతో పిడుగు పడినట్లు గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎవరికి ఏం కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉరుములు,మెరుపులు పిడుగుపాటు ఎందుకు వస్తాయనే అంశాలను బాలికల ఉన్నత పాఠశాల బయో సైన్స్ టీచర్ కృష్ణ మీడియాకు తెలిపారు