దీర్ఘకాలంగా న్యాయ వివాదాలను కొనసాగించడం వల్ల ఇరు వర్గాలు తీవ్రంగా నష్టపోతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. కక్షిదారులు రాజీ పద్దతిన పరిష్కరించుకోవడం వల్ల సత్వర న్యాయానికి వీలుంటుందన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆమె ప్రసంగించారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులు పరిష్కారానికి సమయం పడుతుంది కాని కక్షిదారులు రాజీ పద్దతిన పరిష్కరించుకోవడం వలన సత్వర న్యాయానికి వీలు ఉందని తెలిపారు.