మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు .ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ఎం.జహ్నావి నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పలువురు అధికారులు పాల్గొన్నారు.