కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఓ భారీ గుంత ప్రజలకు ఇబ్బంది కరంగా మారింది. శనివారం సాయంత్రం సమయంలో కరీంనగర్ నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి వైపు వెళ్లే బస్సులు, భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. నిత్యం తెలంగాణ చౌక్ మీదుగా వేలమంది ప్రజలు తిరుగుతుంటారు. రాత్రి సమయంలో ఆదమరచి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు స్పందించి ఆ భార్య గుంతను కూర్చి వేయాలని స్థానికులు కోరుతున్నారు.