మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో ఉండేటటువంటి మతిస్థిమితం లేని ప్రసాద్ నాయక్ నిన్న రాత్రి మృతి చెందాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం 1:00 లకు ఆయన చిత్రపటానికి ట్రాఫిక్ పోలీసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రసాద్ నాయక్ మతిస్థిమితం లేకుండా ప్రజలకు ట్రాఫిక్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించేలా నియమాలను గుర్తు చేసేవాడని తమలో ఒకడిలా ఉండేవాడని అన్నారు. తమను ఎక్కడ చూసినా మర్యాదపూర్వకంగా పలకరించి వారితో పాటు ట్రాఫిక్ పై అవగాహన కల్పించే వారన్నారు. ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు