యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ఆత్మకూరు మండలాలలో వేరువేరుగా దుకాణదారులు మన దుకాణం నినాదంతో పెద్ద ఎత్తున శుక్రవారం బంద్ చేసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు దుకాణదారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. స్థానిక దుకాణదారులపై మార్వాడీలు దాడులు చేస్తున్నారని అలాంటి వాటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.