ఖమ్మంలో బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వినాయక చవితి సందడి తగ్గలేదు. వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. వర్షంలో తడుస్తూనే విగ్రహాలను తమ ఇళ్లకు, మండపాలకు తరలిస్తున్నారు. మండపాల ఏర్పాట్లను అదే ఉత్సాహంతో చేపడుతున్నారు.