తణుకు పరిసర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వినాయక చవితి కావడంతో తణుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మండపాలు వర్షం కారణంగా వెలవెలబోతున్నాయి. వర్షం కారణంగా చిరు వ్యాపారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు