గురువారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి దగదర్తి రాచర్లపాడు ఛానల్ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో 23,000 ఎకరాల పంట పొలాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం, వెంటనే సమగ్ర విచారణ జరిపించి, రైతాంగానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని