Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
హుకుంపేట మండలం భూర్జ,మజ్జివలస పంచాయతీ పరిధిలలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణారావు డిమాండ్ చేశారు.ఆదివాసీల ప్రత్యేక హక్కులు చట్టాలను తుంగలో తొక్కి,షెడ్యూల్ ప్రాంత భూములను ప్రభుత్వం అదానికి కట్టబెట్టాలని చూస్తోందన్నారు. బాధిత ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వం రేపు 28న నిర్వహించే గ్రామసభను వ్యతిరేకిస్తామన్నారు