రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన తాడూరు సాయి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ ఇసుకలోడుతో వస్తుండగా టర్నింగ్ వద్ద బుధవారం బోల్తా కొట్టింది. డ్రైవర్ అతివేగంతోనే ట్రాక్టర్ బోల్తా కొట్టిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఎలాంటి వాహనాలు ప్రయాణికులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ నియంత్రిత వేగంతో ప్రయాణించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.