పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోపిల్లర్ నంబర్1444 వద్ద ఉన్న బాలాజీ నెయ్యి దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.