సత్య సాయి జిల్లా హిందూపురంలో రేపు అనగా సెప్టెంబర్ 4వ తేదీన గణేష్ నిమజ్జనానికి 1,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు. బందోబస్తు విధులలో అడిషనల్ ఎస్పీ, 1 , డిఎస్పీలు, 5 మంది, సిఐలు,33, ఎస్సైలు, 63 మంది, ఎఎస్సై మరియు హెడ్ కానిస్టేబుల్స్ , 170, మంది , పోలీసు కానిస్టేబుల్స్ , 316, ఏపీఎస్పీ ప్లటూన్ లు 4, ఎఆర్ సెక్షన్లు, మహిళా పోలీసులు,49, మంది , హోంగార్డులు 210, మంది , స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం 1000 మంది పోలీసులను మోహరింపజేశామన్నారు.