పలమనేరు: మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు. కాల్వపల్లి, వైయస్సార్ డ్యాం వద్ద కౌండిన్య నది నందు ఓ మగ శవం లభ్యమయింది. ఆ వ్యక్తికి బట్ట తల ఉంది ఎడమ చేతికి బంగారు రంగు వాచ్ ధరించి ఉన్నాడు, మెడలో కరుంగళి మాల లాంటిది ధరించి ఉన్నాడు. సదరు వ్యక్తిని మండల ప్రజలు ఎవరైనా గుర్తుపడితే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎస్ఐ లోకేష్ రెడ్డి కోరారు. కాగా ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడా లేదా ఎవరైనా హత్య చేశారని వివరాలు పోస్ట్ మార్టం అనంతరం దర్యాప్తు చేసి పోలీసులు తెలుపుతామన్నారు.