Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
కావలి పట్టణం వైకుంఠపురం వద్ద అనపగుంటను మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ గురువారం పరిశీలించారు. వైకుంఠపురం, జనతాపేట నుంచి అనపగుంటకు వచ్చే డ్రైనేజ్ వాటర్ ఓవర్ ఫ్లో అవుతోంది. బ్రిడ్జిపైకి మురుగు రావడంతో డ్రైనేజీ కాల్వకు మెస్ ఏర్పాటు చేశారు. మెస్ ఏర్పాటుతో కాలువలో వ్యర్థాలు పేరుకోవన్నారు. మెస్ వద్ద పేరుకునే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.