వికారాబాద్ జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు అధిక రుసుములు వసూలు చేయడం అనుమతి లేకుండా కేంద్రాలను మార్పిడి చేయడం ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో మీసేవ నిర్వాహకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్ధారించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే మీసేవ కేంద్రం గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు మీ సేవలు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో నడపాలని సూచించారు.